Friday, 20 September 2013

ఒక పూలబాణం తగిలింది మదిలో



పల్లవి

ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
||
ఒక పూల||

చరణం 1

అలనాటి కలలే ఫలియించే నేడే||2||
మనసైన వాడే మనసిచ్చినాడే
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి||2||
వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి
||
ఒక పూల||

చరణం 2

ఏ పూర్వబంధమో అనుబంధమాయే||2||
అపురూపమైన అనురాగమాయె
నీ కౌగిట హాయిగా సోలిపోయి||2||
సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలోయి
||
ఒక పూల||

No comments:

Post a Comment