Sunday, 22 September 2013

అరె ఏమైందీ అరె ఏమైందీ
అరె ఏమైందీ అరె ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది

నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో

బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వృఆయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వృఆసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు
మనిషౌతాడు

Labels: Letter - "అ", Movie - Aaradhana, Music Director - Ilayaraja 

No comments:

Post a Comment