కాలిన మనసుతో కదిలే మనిషిని
కాలం గుప్పిటా కరిగే నిజాన్ని
నా మదనం అర్ధం చేసుకో...
నీ మనసు కాలంతో రాసుకో...
కధ చెప్పే కధకుడిని కాదు
ఎద విప్పే పిరికొడ్ని కాదు
చరణం 1:
డ్యూటీలో ఉన్నా ఒక ఆఫీసర్ మీద దౌర్జన్యం చేసినందుకు
ఇతని డిగ్రీ కాన్సిల్ చేయటం అయినాది
ధనబలమే సింహాసనమై...దౌర్జన్యమే శాసనమై
అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్యరోధనమై
ధనబలమే సింహాసనమై...దౌర్జన్యమే శాసనమై
అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్యరోధనమై ...
నీతిని చంపి పాతర వేస్తే...
నియమం చట్టం మంట కలిస్తే...
రంగులు మార్చే ఉసరవేల్లులే రాజయలేలక ఏమవుతాయి?
నా మదనం అర్ధం చేసుకో..
నీ మనసు కాలంతో రాసుకో...
కధ చెప్పే కధకుడిని కాదు
ఎద విప్పే పిరికొడ్ని కాదు
చరణం 2:
సోదర సోదరిమనుల్లరా అసలు మనదేశంలో నిరుద్యోగులే లేరు
ఇక పుట్టారు మా పార్టీ పుట్టనివ్వదు అని సవినయంగా మనవి చేస్తున్న
ఏ రోజైతే ఒక విద్యార్థి రోడ్దు మీద నిరుద్యోగిగా కనబడతాడో
ఆ రోజు మా పార్టీ ఆత్మహత్య చేసుకుంటుందని ఈ సందర్భంగా నొక్కి వాక్కానిస్తున్న
ఒక విద్యార్ధికి మూడు ఉద్యోగాలు ఇవ్వటమే మా పార్టీ లక్ష్యమని
మళ్లీ ఒకసారి సవినయంగా మనవి చేస్తున్న
చీకటి తోనే నా నేస్తం..సిరుల పైనే నా హస్తం
పలికిన మాటే ప్రచండ విలయం...గీసిన గీతే విధివలయం
చీకటి తోనే నా నేస్తం...సిరుల పైనే నా హస్తం
పలికిన మాటే ప్రచండ విలయం..గీసిన గీతే విధివలయం
మహారాజునా కాదు కాదు...మహాత్మున్నాకానే కాదు
లోకం నాడి పట్టిన వాడ్ని...కాలానికి గురిపెట్టిన వాడ్ని

No comments:
Post a Comment