Sunday, 22 September 2013

ఆ కనులలో కలల నా చెలీ
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

నిదురించు వేళ హౄదయాంచలాన
అలగా పొంగెను నీ భంగిమ
అది రూపొందిన స్వర మధురిమ
ఆ రాచ నడక రాయంచ కెరుక
ఆ రాచ నడక రాయంచ కెరుక
ప్రతి అడుగూ శౄతిమయమై
కణకణమున రసధునులను మీటిన

నీ రాకతోనే ఈ లోయ లోనే
అణువులు మెరిసెను మణి రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకౄతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన


Labels: Letter - "ఆ", Lyrics - Veturi Sudhararamamurthy, Movie - Aalaapana

No comments:

Post a Comment