Monday, 16 September 2013

యేజే… యేవో… చిరు పలుకులు రానీ…

యేజే… యేవో…
చిరు పలుకులు రానీ…

గుండెల్లోంచి పెదవుల్లోకి
పెదవుల్లోంచి నా యెదనంటే
మాటేదైనా రానీ…
నీలో ఉన్న మాటలన్నీ
నిలవము అని… రానీ…
చేరువై దూరానా నిలిచేదెలా
ప్రేమనే ఆ మాటే పలికేదెలా…

పలుకు భారమైనా
మనసు నీడలొన… నువ్వేనా…
యేజే… యేవో…
చిరు పలుకులు రానీ…
నీ కలే చూశాక కనుపాపలే
యే కలా రానీక వెలివేసెనా…

చివరి శ్వాసలోనూ
మొదటి శ్వాసలాగా నే రానా…
యేజే… యేవో…
చిరు పలుకులు రానీ…

గుండెల్లోంచి పెదవుల్లోకి
పెదవుల్లోంచి నా యెదనంటే
మాటేదైనా రానీ…
నీలో ఉన్న మాటలన్నీ
నిలవము అని…

No comments:

Post a Comment