Sunday, 22 September 2013

ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ ఎల్లువై
ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి
ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ ఇంతకీ ఏడుందే అత్తింటి దారీ
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హయ్‌నా వెన్నెల నదిరా హయ్‌నా వన్నెల నిధిరా
హయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ||హొయ్‌నా||

వగలమారి నావ, హొయలు మీరినావ, అలలు ఊయలూగినావ
తళుకు చూపినావ, తలపు రేపినావ, కలల వెంట లాగినావ
సరదాగ మితిమీరి అడుగే ఏమారి సుడిలో పడదోసే అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా పోదాంపద ఆగకేమరీ ||హొయ్‌నా||

నీటిలోని నీడ చేతికందుతుందా
తాకిచూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడికాద
తరిమిచూడు దొరుకుతుందా
చక్కానిదానా చుక్కానికానా నీ చిక్కులన్నీ దాటగా ఓ
వద్దూ అనుకున్నా వదలను నెరజాణా
నేనే నీ జంటని రాసి ఉందిగా ||హొయ్‌నా||
Labels: Letter - "ఒ", Movie - Aata, Music Director - Devi Sri Prasad, Singer - Chitra, Singer - Karthik 

No comments:

Post a Comment