Sunday, 22 September 2013

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా
నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా
పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదా
పద పద అంటోందే హయ్ పదే పదే నీ అందం
అహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

తీగ నడుము కదా తూగి తడబడదా
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసుకద బైట పడగలదా
అంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
కబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహకొంటెగా కవ్వించు తుంటరివో
వాడి తపనలతో మగవాడి తహ తహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగినా అసలు సంగతి దాగునా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||


Labels: Letter - "న", Movie - Aata, Music Director - Devi Sri Prasad, Singer - Siddarth, Singer - Sumangali 

No comments:

Post a Comment