Saturday, 21 September 2013

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే


బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ


బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తేనే వాగుల్లో మల్లెపూలల్లె తేలిపోదాములే
గాలి వానల్లో మబ్బు జంటల్లె రేగిపోదాములే
విసిరే కొస చూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే

వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో వున్నా తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

పూత పెదవుల్లో పొత్తు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలోకటై రమ్మంటే

కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమనీ

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

No comments:

Post a Comment