Monday, 16 September 2013

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కధ మీటగా
అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై
గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు
గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను నీకు
ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణ
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే
లొకాలే జయించే మనస్సే నీ కోసం నిజంగా జపించే
సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా
అణువైన నా గుండెలోన కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లె తలంబ్రాలలోన నా పరువాలు పండించుకోనా
నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం

నీ ఎద వీణపై మన కధ మీటగా
నీ ఎద వీణపై మన కధ మీటగా
అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా

No comments:

Post a Comment