Sunday, 22 September 2013

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా

స్వార్ధంలేని త్యాగాలనే చెసేది ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేది ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నడిపిందీ ప్రేమా

Labels: Letter - "ఓ", Lyrics - Chandrabose, Movie - Aandhrudu, Music Director - Kalyan Mallik, Singer - KK 

No comments:

Post a Comment