కెన్ యు ఫీల్ హర్?ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ తో
హర్?
కెన్ యు ఫీల్ ది లవ్?యస్...

మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం
కను రెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయనే
తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళ యదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేలా
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే యద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలి లాగే ఉరకలేశా
No comments:
Post a Comment