Sunday, 6 October 2013

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా...........

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా........
సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి........
నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులే....... సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా........
నవ్వి నవ్వి తడికాని నీ కంటిపాపలే........ సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా........
ఎక్కెక్కి ఏడ్చే కన్నీరు ఉప్పన......
ఫక్కుమన్న నవ్వే ఒక తీపి ఉప్పెన.....
చిక్కులెన్ని రాని కరిగిస్తుంది ఛప్పున ||సువ్వి సువ్వమ్మ||


మావిపళ్ళు ఇవ్వదా మండువేసవి......
వాన పాట పాడదా పైరు పల్లవి.......
మంచు దారిలో..... సంకు రాత్రిని...... తెస్తుంది కాదా చలి.....
కాళరాత్రిలో.... కాంతి రవ్వలై..... వస్తుంది దీపావళి......
పండుగలన్నీ కనువిందుగ అల్లి.......
ఋతువుల హారం అందిచే కాలం......
దేవుడు పంపిన దీవెన అనుకుంటే..... ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే.......
దేవుడు పంపిన దీవెన అనుకుంటే..... ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే....... ||సువ్వి సువ్వమ్మ||

నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా
ఈ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా
రేకులు వాడని పున్నమి నవ్వులు
రేపటి ఆశల ఊపిరి గువ్వలు
ఆలపించే సంగీతంలో సంగతులే గుండెలలో హాయి కచ్చేరి.. చెయ్యాలి ||సువ్వి సువ్వమ్మ||

No comments:

Post a Comment